ప్రకాష్ రాజ్ ‘తప్పు’టడుగులు!

Prakash Raj


ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచనతో చెయ్యాలి. “మా” ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆవేశంతోనో, విరక్తితోనే ప్రకాష్ రాజ్ “మా” సభ్యుడిగా ఇక కొనసాగనని ప్రకటించారు. సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. ఆ తర్వాత ఆయన ప్యానెల్ లో గెలిచినా 11 మంది కూడా పదవులకు రాజీనామా చేశారు. కానీ సభ్యులుగా మాత్రం ఉంటామన్నారు.

మంచు విష్ణు ఇప్పటికే “మా” కొత్త అధ్యక్షడిగా బాధ్యత తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన ఐదు రోజుల తర్వాత ప్రకాష్ రాజ్ కి ఇప్పుడు సడెన్ గా ఒక విషయం వెలిగింది. మొత్తం ఎన్నికల వోటింగ్ ప్రక్రియకి సంబంధించిన సీసీ ఫుటేజీని పరిశీలించాలని అయన అనుకుంటున్నారు. “మా” సభ్యుడిగా రాజీనామా చేసి, తన ప్యానెల్ సభ్యులను పదవి నుంచి బయటికి రమ్మని చెప్పిన తర్వాత తాపీగా ఆయనకు ఎన్నికల సీసీ ఫుటేజీ కావాల్సి వచ్చింది.

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉటకింస్తూ ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. ఒక సంఘం ఎన్నికలకు, చట్టసభలకు జరిగే ఎన్నికల నియమ నిభందనలు ముడి పెడుతూ ప్రకాష్ రాజ్ పాయింట్ లు లేవదీశారు.

ముందే సభ్యుడిగా రాజీనామా చెయ్యడం ఎందుకు, చేసినట్లు ప్రకటించిన ఐదు రోజుల తర్వాత ‘అవకతవకల’కి సంబంధించి వీడియోలు చూడాలనుకోవడం ఎందుకు? ఈ పని ఎదో సోమవారమే చేసి ఉంటే మ్యాటర్ వేరుగా ఉండేది కదా! అందుకే ఆవేశం, డైలాగులు తప్ప ఆయనకీ ‘పోల్’ మేనేజ్మెంట్ తెలీదని అర్థమైంది.

 

More

Related Stories