నరేష్ ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడు: ప్రకాష్ రాజ్

- Advertisement -
Prakash Raj

మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీపడుతున్న ప్రకాష్ రాజ్ ప్రత్యర్థి ప్యానెల్ పై ఘాటైన విమర్శలు చేశారు. నన్ను తెలుగువాడిని కాదు అంటూ ప్రచారం చేస్తున్న మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు నేను చెప్పినట్లు తెలుగులో డైలాగ్ లు స్పష్టంగా చెప్పగలరా అంటూ సూటిగా ప్రశ్నించారు ప్రకాష్ రాజ్.

అలాగే, విష్ణు ప్యానెల్ కి మద్దతు తెలిపిన ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్ పై విరుచుకుపడ్డారు.

“నరేష్ కృష్ణుడి పాత్ర పోషిస్తారట. కానీ ఆయన చక్త్రం ఆల్రెడీ లాగేసుకున్నాం. నరేష్ ఒక అహంకారి. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి. నటులు అందరూ సిగ్గుపడేలా ఉంది నరేష్ ప్రవర్తన,” అని నరేష్ ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు.

గెలవడానికి ప్రయత్నించండి కానీ అవతలివారిని ఓడించడానికి కుట్రలు చేయొద్దు అనేది ప్రకాష్ రాజు సలహా. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేతలను, నాయకులను ఈ ఎన్నికల్లోకి లాగొద్దన్నారు. “ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ విష్ణుకి బంధువైతే ఆయన వచ్చి ఓటేస్తారా? జగన్ గారి పేరును ఈ ఎన్నికల్లోకి ఎందుకు లాగడం? కేటీఆర్ రెండు సార్లు మాట్లాడినంత మాత్రాన క్లోజ్ అయిపోతారా,” అంటూ విష్ణుని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.

మా సభ్యులకి మంచి వైద్యం అందేలా ఐదు ఆసుపత్రిలతో ఒప్పందం చేసుకుంటున్నాం అని చెప్పారు ప్రకాష్ రాజ్.

More

Related Stories