ప్రకాష్ రాజ్ వెర్సస్ అగ్నిహోత్రి


నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా కాలంగా పోరాడుతున్నారు. మాట్లాడుతున్నారు. ఐతే, ఆయనపై అర్బన్ నక్సల్ అని ముద్ర వేసింది బీజేపీ అనుకూల వర్గం. ఆ రాజకీయాలు ఎలా ఉన్నా ఒక సినిమా కారణంగా ప్రకాష్ రాజ్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మధ్య ఇప్పుడు మాటల యుద్ధం జరుగుతోంది. అది కూడా ఎప్పుడో విడుదలైన సినిమా కోసం వీళ్ళిద్దరూ పోట్లాడుకోవడం విచిత్రం.

‘ది కాశ్మీర్ ఫైల్స్’ పేరుతో వివేక్ అగ్నిహోత్రి తీసిన సినిమా సంచలన విజయం సాధించింది. చిన్న చిత్రం అది. కానీ వసూళ్లు మాత్రం దాదాపు 300 కోట్ల వసూళ్లు అందుకొంది. అంత భారీ హిట్ కొట్టడంతో ఒక్కసారిగా వివేక్ అగ్నిహోత్రి రేంజ్ మారిపోయింది. ఆయన ఇప్పుడు ‘ది వాక్సిన్ వార్’ పేరుతో మరో చిత్రం తీస్తున్నారు.

ఐతే, ఇటీవల ఒక ఈవెంట్ లో ప్రకాష్ రాజ్ ఈ సినిమా గురించి మాట్లాడారు. “కాశ్మీర్ ఫైల్స్, ఒక చెత్త సినిమా. అంతర్జాతీయ దర్శకుడు ఒకరు ఉమ్మేశారు ఆ సినిమాపై. అయినా వీళ్లకు సిగ్గు రావడం లేదు. మాకు ఆస్కార్ ఎందుకు ఇవ్వరు అంటూ దర్శకుడు అడుగుతున్నాడు. ఆస్కార్ కాదు కదా భాస్కర్ అవార్డు కూడా రాదు,” అంటూ ప్రకాష్ రాజ్ వివేక్ అగ్నిహోత్రి గురించి చులకనగా మాట్లాడారు.

దాంతో, వివేక్ ఘాటుగా స్పందించారు. “జనం ఆదరించిన ఒక చిన్న చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్, ఈ అర్బన్ నక్సల్స్ కి ఏడాది తర్వాత కూడా నిద్రపట్టనివ్వడం లేదు. వారి పెంపుడు కుక్క ప్రేక్షకులను అరిచే కుక్కలు అని అంటోంది. మిస్టర్ అంధకార రాజ్, భాస్కర్ అవార్డు నాకు ఎలా దక్కుతుంది. అది నీదే,” అని వివేక్ ట్వీట్ చేశారు.

Advertisement
 

More

Related Stories