ఇప్పుడీ స్వారీ ఎందుకు ప్రణీత

Pranitha Subash

లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా గ్లామర్, ఫిట్ నెస్ మెరుగుపరుచునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఎవరి పంథాలో వాళ్లు వెళ్లారు. అయితే హీరోయిన్ ప్రణీత మాత్రం అందరికంటే కాస్త వెరైటీగా ఆలోచించింది. విభిన్నమైన పంథాను ఎంచుకుంది. అవును.. ఆమె ఏకంగా గుర్రపు స్వారీ నేర్చుకుంది.

బెంగళూరులోని ఓ పాపులర్ ఫామ్ లో ప్రణీత గుర్రపుస్వారీ నేర్చుకుంది. ఇదేదో ఆమె కొత్త సినిమా కోసమో, లేక ఆటల కోసమో కాదు. కేవలం ఫిట్ నెట్ ను మెరుగుపరుచుకునేందుకు ప్రణీత ఈ పని చేసింది. ఫిట్ గా ఉండాలంటే గుర్రపుస్వారీకి మించింది లేదంటోంది ఈ బ్యూటీ.

హార్స్ రైడింగ్ లో తను చాలా మెళకువలు నేర్చుకున్నానని చెప్పిన ప్రణీత.. చాలామంది హీరోయిన్లలో లేని క్వాలిటీ ఇప్పుడు తనకు దక్కిందని ఆనందంగా చెబుతోంది. అలా లాక్ డౌన్ లో ఫిట్ నెస్, గ్లామర్ ను పెంచుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్స్ తో బిజీ అవుతోంది. ఆమె చేతిలో “భుజ్-ది ప్రైడ్ ఆఫ్ ఇండియా”, “రమణ అవతార”, “హంగామా-2” సినిమాలున్నాయి.

Related Stories