ప్రభాస్ – ప్రశాంత్ సినిమా ప్రకటన?

ప్రభాస్ వరుసగా సినిమాలు అన్నౌన్స్ చేస్తున్నాడు. “రాధేశ్యామ్” షూటింగ్ దశలో ఉండగానే రెండు సినిమాలు ప్రకటించాడు. ఒకటి “ఆదిపురుష్”, రెండోది నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్. ఇప్పుడు మూడో సినిమా ప్రకటన కూడా రానుంది అనేది టాక్. “KGF” సినిమాతో ఒక్కసారిగా ఇండియా అంతా పాపులర్ అయిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీ చేస్తాడని టాక్ చాలా కాలంగా ఉంది. అది ఇప్పుడు అఫీషయల్ గా అనౌన్స్ చేస్తారని అంటున్నారు.

“KGF”నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ తాజాగా ఒక ట్వీట్ చేసింది. డిసెంబర్ రెండున మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషాలకు మా సంస్థ తదుపరి పాన్ ఇండియా సినిమా ప్రకటిస్తాం అనేది ఆ ట్వీట్ సారాంశం. దాంతో, అది ప్రభాస్ – ప్రశాంత్ సినిమానే కానుంది అనేది అంచనా. మరో రెండు రోజులు ఆగితే క్లారిటీ.

దర్శకుడు ప్రశాంత్ నీల్ “ఉగ్రం” అనే పేరుతో ఇంతకుముందు కన్నడంలో ఒక మాఫియా థ్రిల్లర్ తీశాడు. అది మంచి పేరు తెచ్చిపెట్టింది అతనికి. అదే కథను కొంత మార్చి లావిష్ గా ప్రభాస్ తో తీయనున్నాడట. కథ, స్క్రీన్ ప్లే (రీమేక్ కాబట్టి) రెడీ గా ఉంది కాబట్టి స్పీడ్ గా సినిమా తీయొచ్చని ప్రభాస్ అనుకుంటున్నాడట.

ఐతే, ఇన్ని సినిమాల ప్రకటనలతో ఏది ముందు వస్తుంది, ఏది ఎప్పుడు అన్న విషయంలో కన్ఫ్యూజన్ కూడా ఉంది.

More

Related Stories