దానయ్య పోస్టర్ వల్లే ఊహాగానం

- Advertisement -
Prashanth Neel

ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో అల్లు అర్జున్… ఇలా రోజుకో న్యూస్ బయటికి వస్తోంది. ఈ కన్నడ దర్శకుడికి అంతా క్రేజ్ దక్కింది. ఐతే, నీల్ ఎన్ని సినిమాలు చెయ్యగలడు? ఒక సినిమా పూర్తి అయిన తర్వాతే మరోటి కదా?

ఇప్పటికే అతను ప్రభాస్ హీరోగా భారీ మూవీ ‘సలార్’ తీస్తున్నారు. లాక్డౌన్ వల్ల ఈ షూటింగ్ షెడ్యూలు తారుమారు అయింది. ఇది పూర్తి కావాలంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి అవుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా తీయాలి. ఈ రెండు ఫిక్స్. సలార్, ఎన్టీఆర్ మూవీ లతో 2022 కంప్లీట్ అవుతుంది ప్రశాంత్ నీల్ కి.

ఆ తర్వాత అల్లు అర్జున్ తో మూవీ చేస్తాడా? రామ్ చరణ్ తోనా అనేది తేలుతుంది. అప్పటికి ఏమైనా మారొచ్చు. ఏదైనా జరగొచ్చు. ఐతే, రామ్ చరణ్ తో మూవీ అంటూ ప్రచారం ఊపందుకొంది. దానికి కారణం నిర్మాత డీవీవీ దానయ్య రీసెంట్ గా ఒక పోస్టర్ విడుదల చెయ్యడమే.

ప్రశాంత్ నీల్ తీసిన ‘కేజీఎఫ్’ విడుదల కాగానే అతనికి మొదట భారీ అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చిన నిర్మాతలు ఇద్దరే. ఒకరు మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రెండో డివివి దానయ్య. మైత్రికి ఎన్టీఆర్ మూవీని సెట్ చేశాడు ప్రశాంత్ నీల్.

దానయ్యకి కూడా మూవీ చెయ్యాలి. ఐతే, అది ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేం. రామ్ చరణ్ ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాని దానయ్య బ్యానర్లోనే చేస్తున్నాడు. మరి ఇంకో భారీ సినిమాని కూడా దానయ్య ఖాతాలోనే వేస్తాడా?

 

More

Related Stories