
ఇది ఎన్నికల టైం. ఇక పొలిటికల్ సినిమాల తంతు మొదలైంది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ పేరుతో తనదైన శైలిలో పొలిటికల్ మూవీ తీస్తున్నారు. అది పూర్తిగా వైసీపీ కోసం తీస్తున్న మూవీ. కానీ, వర్మ సినిమాలకు పెద్దగా ఆదరణ ఉండదు. జనం పట్టించుకోరు.
అందుకే, ఇప్పుడు రెండు పెద్ద సినిమాలను నిర్మిస్తున్నాయి వైసీపీ, టీడీపీ. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కి లబ్ది కలిగేలా దర్శకుడు మహి వి రాఘవ్ “యాత్ర 2” అనే సినిమా మొదలుపెట్టారు. ఇది ఫిబ్రవరి 2024న విడుదల కానుంది.
ఇక తన పెద్దనాన్న నారా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా నారా రోహిత్ “ప్రతినిధి 2” తీస్తున్నారు. ఇది కూడా పొలిటికల్ చిత్రమే. ఐతే, వైసీపీ వాళ్ళ సినిమా కన్నా ముందే విడుదల అయ్యేలా జనవరి 25, 2024ని డేట్ గా ఫిక్స్ చేశారు నారా రోహిత్.
ఈ రెండే కాదు రాబోయే రోజుల్లో మరిన్ని పొలిటికల్ చిత్రాలు వస్తాయి. కానీ, ఈ రెండు చిత్రాలు మాత్రం పోటీపడుతున్నాయి. రెండూ వాళ్ల పార్టీ గురించి ఇన్ డైరెక్ట్ ప్రచారం చేసుకుంటాయి.