ప్రభాస్ ‘టైం’ బాలేదంట!

- Advertisement -
Prabhas


ప్రభాస్ ఇప్పుడు నాలుగు సినిమాలతో బిజీ బిజీ. వందల కోట్ల ఆదాయం. రెండు భారీ ఫ్లాపులు వచ్చినా ఇంచు కూడా తగ్గని పాపులారిటీ. ఇంత సూపర్ గా ఆయన టైం నడుస్తోంది. మరి ఆయన టైమ్ బాలేదనే ఆ హెడ్డింగ్ ఏంటి అనుకుంటున్నారా?

యూట్యూబులో, సోషల్ మీడియాల్లో హీరో, హీరోయిన్ల జాతకాలు చెప్పే ఓ స్వామి చెప్పిన కొత్త ఏడాది పంచాంగం ఇప్పుడు వైరల్ అయింది.

ఈ స్వామి చెప్తున్నది ఏంటంటే 2023లో ప్రభాస్ కి టైం బాగుండదట. ఆరోగ్య సమస్యలు వస్తాయట. సో షూటింగ్ లు అన్ని ఇబ్బందుల్లో పడుతాయంట. ప్రభాస్ జాతకం 2023లో ఇదే అంటూ ఈయన చెప్పిన జోస్యం ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తోంది.

ఐతే, ఈయన చెప్పిన పాత జాతకాల చిట్టాని ప్రభాస్ అభిమానులు బయటపెట్టారు. ఒకట్రెండు తప్ప, ఆయన చెప్పిన జోస్యాల్లో మిగతావేవీ నిజం కాలేదు. కాబట్టి ఈయన చెప్పే మాటలను నమ్మొద్దు అని ప్రభాస్ అభిమానులే కామెంట్స్ పెడుతున్నారు.

 

More

Related Stories