గర్భవతి…ఐనా షూటింగులల్లో


అలియా భట్ త్వరలో ఒక బేబీకి జన్మనివ్వనుంది. తాను తల్లి కాబోతున్నట్లు ఆమె ఇటీవల ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ లో హీరో రణబీర్ కపూర్ ని పెళ్లాడింది ఆలియా భట్. ఐతే, పెళ్ళికి ముందు ఆమె పలు సినిమాలు అంగీకరించింది. వాటిని పూర్తి చేసే పనిలో ఉంది.

ముందుగా తన మొదటి హాలీవుడ్ మూవీ షూటింగ్ పూర్తి చేసింది. ఇప్పుడు రణవీర్ సింగ్ తో కలిసి నటిస్తున్న ‘రాకీ ఔర్ రాణి ప్రేమ్ కహానీ’ చిత్రం పూర్తి చేసేందుకు షూటింగ్ కి వచ్చింది. మరి కొంత కాలం వెయిట్ చేస్తే కడుపు కనిపిస్తుంది. అప్పుడు షూటింగ్ లో పాల్గొనడం కష్టం. అందుకే, నెల రోజుల్లో అన్ని కమిట్ మెంట్స్ పూర్తి చేసేందుకు శ్రమిస్తోంది.

ఆమె షూటింగ్ లొకేషన్ లో పాల్గొంటున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.

సినిమాకి 5, 6 కోట్ల పారితోషికం తీసుకునే అలియా భట్ రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంటుందట.

Alia Bhatt and Ranbir Kapoor

భర్త రణబీర్ తో నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సెప్టెంబర్ లో విడుదల కానుంది. హాలీవుడ్ చిత్రం, అలాగే ‘రాకీ ఔర్ రాణి ప్రేమ్ కహానీ’ వచ్చే ఏడాది విడుదల అవుతాయి.

 

More

Related Stories