ప్రేమసాగరం హీరో కన్నుమూత

టి. రాజేందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఉయిరుళ్లవరై ఉష’ (‘చివరివరకు ఉషతోనే’ అనే అర్థం) అప్పట్లో తమిళనాట సంచలనం. 1983లో విడుదలైన ఆ మూవీ తెలుగులో ‘ప్రేమసాగరం’ పేరుతో విడుదలైంది. ఆ సినిమాలో హీరోగా ‘గంగ’ అనే నటుడు నటించారు. ఆ ఒక్క సినిమా ఆయనికి ఎనలేని పేరు తెచ్చింది.

ఈ రోజు ఆయన కన్నుమూశారు. ఆయనికి 63 ఏళ్ళు. గుండెపోటుతో ఆదివారం తుదిశ్వాస విడిచారు.

“ప్రేమసాగరం” కాకుండా మరికొన్ని చిత్రాల్లోనూ ఆయన నటించారు. కానీ ఆయన చివరివరకు “ప్రేమ సాగరం” హీరో అనే గుర్తింపుతోనే గడిపారు.

“చక్క నైన ఓ చిరుగాలిఒక్క మాట వినిపోవాలి”, “అందాలొలికే సుందరి రాతిరి కలలోకొచ్చేను”, “హృదయమనే కోవెలలో”, “నామం పెట్టు నామం పెట్టు” ఇలా ఆ సినిమాలో ప్రతి పాటా హిట్‌. తెలుగులో ఒక పెద్ద సంచలనం. డబ్బింగ్ సినిమాల చరిత్రలో అదొక మరుపురాని హిట్.

Advertisement
 

More

Related Stories