ప్రిన్స్ కి ఆ హైప్ ఏది?

prince

‘జాతిరత్నాలు’ వంటి సంచలన విజయం అందించిన దర్శకుడు అనుదీప్ కి తమిళ అగ్ర హీరోలలో ఒకరైన శివ కార్తికేయన్ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. అదే ‘ప్రిన్స్’ అనే సినిమా. దర్శకుడితో పాటు నిర్మాతలు కూడా తెలుగు వాళ్ళే. మ్యూజిక్ కూడా అగ్ర సంగీత దర్శకుడు తమన్. ఐతే, సినిమా విడుదల దగ్గరికి వస్తున్నా ఆ సినిమాపై ఆసక్తి, హైప్ రావట్లేదు.

తెలుగులో పెద్దగా స్పందన లేదని గ్రహించిన శివ కార్తికేయన్ ఇక తమిళ మార్కెట్ పై దృష్టి పెట్టాడు.

ఈ సినిమా టీజర్ ని చెన్నైలో భారీ ఎత్తున విడుదల చేస్తారట. అలాగే, తమిళనాడు ఇంజనీరింగ్ కాలేజీల్లో సినిమాని ప్రమోట్ చేయనున్నారు. శివ కార్తికేయన్ తమిళనాట మంచి మార్కెట్ ఉన్న యువ హీరో. వరుస విజయాలు ఉన్నాయి. తెలుగు మార్కెట్ కోసం ‘ప్రిన్స్’ ఒప్పుకున్నాడు ఈ యువ హీరో. కానీ తెలుగులో ఇంతవరకు హైప్ లేదు.

హీరోయిన్ ఫారిన్ భామ కావడం, ఇప్పటివరకు విడుదలైన పాటలు ఏవీ క్లిక్ కాకపోవడంతో జనాల చూపు ఇంకా ‘ప్రిన్స్’పై పడలేదు. మరి, ట్రైలర్ తో అయినా ఏమైనా పబ్లిసిటీ పెరుగుతుందేమో చూడాలి.

 

More

Related Stories