విలన్ పాత్రపై తర్జనభర్జన!


పృథ్వీరాజ్ సుకుమారన్ … మళయాలంలో సూపర్ స్టార్. హీరోగా, దర్శకుడిగా అతనికి ఎంతో క్రేజ్ ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ని తెలుగులో పరిచయం చెయ్యాలని పలువురు ప్రయత్నించారు. కానీ ఆయన ఇప్పటివరకు ఒప్పుకోలేదు. లేటెస్ట్ గా ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ చిత్రంలో విలన్ గా నటిస్తున్నట్లు టాక్.

“సలార్ లో నటించమని దర్శకుడు ప్రశాంత్ నీల్ అడిగిన మాట వాస్తవమే. కానీ, నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను కాబట్టి నీల్ తో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటా. ప్రభాస్ తో నటించాలని నాకూ ఉంది,” అని పృథ్వీరాజ్ సుకుమారన్ మీడియాకి తెలిపారు. ఆయన నటించిన ‘కడువా’ అనే మలయాళ చిత్రం తెలుగులో కూడా అదే పేరుతో విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడారు.

ఆయన మాటలను బట్టి చూస్తే ‘విలన్’ పాత్రతో తెలుగుకి పరిచయం కావడం కరెక్టేనా అనే ఊగిసలాట ఉన్నట్లు అనిపిస్తోంది.

అందుకే, ఆయన ఇప్పటివరకు సైన్ చెయ్యలేదు. పృథ్వీరాజ్ ని ఒప్పించేందుకు ప్రశాంత్ నీల్ నాలుగు, అయిదు నెలలుగా ప్రయత్నిస్తున్నారు. “కేజీఎఫ్ 2” మలయాళం వర్షన్ ని పృథ్వీరాజ్ రిలీజ్ చేశారు. సో, వీరిద్దరి మధ్య స్నేహం ఉంది.

 

More

Related Stories