
మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తెలుగులోకి అడుగుపెడుగుతున్నారు. ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉండే కీలక పాత్ర పోషిస్తున్నారట. మొదట దర్శకుడు కథ చెప్పినప్పుడు ఒప్పుకున్నాడట. కానీ, తాను ఇచ్చిన డేట్స్ దర్శకుడు ప్రశాంత్ నీల్ వాడుకోలేదట.
తర్వాత కొన్నాళ్ళకు నీల్ డేట్స్ గురించి అడిగినప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పెద్దగా ఆసక్తి చూపలేదట. వేరే కమిట్ మెంట్స్ ఉండడంతో వేరే నటుడిని తీసుకోమని చెప్పారు పృథ్వీరాజ్. విషయం తెలుసుకున్న ప్రభాస్ వెంటనే ఫోన్ చేశారట. పృథ్వీరాజ్ ఆ పాత్ర పోషిస్తేనే సినిమాకి ఆకర్షణ అవుతుందని ప్రభాస్ భావించారు. దాంతో, ప్రభాస్ పృథ్వీరాజ్ ని కన్విన్స్ అయ్యేలా మాట్లాడారట.
ప్రభాస్ అడిగిన తీరు, ఆయన మంచితనం వల్లే తన మనసు మార్చుకొని మళ్ళీ డేట్స్ ఇచ్చేందుకు ఆ మలయాళ హీరో అంగీకరించారు. ఈ విషయాన్నీ తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ బయటపెట్టారు.
‘సలార్’ కొత్త షూటింగ్ షెడ్యూల్ లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది.
మలయాళంలో పేరొందిన అగ్ర హీరోలందరూ ఇప్పటికే తెలుగులో నటించారు. మోహన్ లాల్, మమ్మూట్టి, దుల్కర్, ఫహద్ ఫాజిల్ ఇప్పటికే తెలుగు మూవీస్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ జాబితాలోకి వచ్చారు.