ప్రియా ఆనంద్ పెళ్లి కలకలం!

Priya Anand


ప్రియా ఆనంద్ అనే హీరోయిన్ గుర్తుందా? ఒక పుష్కర కాలం క్రితం ఆమె బాగా హడావిడి చేసింది. ‘లీడర్’, ‘రామ రామ కృష్ణ’, ‘180’ వంటి సినిమాలతో స్థిరపడిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ, ఆమె కెరీర్ విషయంలో తప్పటడుగులు వేసింది. దాదాపుగా సినిమా జనాలు ఆమెని మరిచిపోయారు.

ఐతే, ఇప్పుడు ఆమె మళ్ళీ ఒక ప్రకటనతో కలకలం సృష్టించింది. నిత్యానంద్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె తాజాగా ప్రకటించింది. అది పెద్ద వార్త అయింది. మీడియాలో వార్తలు వచ్చాక, ‘అబ్బే అది జోక్’ అని వివరణ ఇచ్చింది.

ఇంతకీ, ఆమె పెళ్లి ఎప్పుడు ఎందుకు టాపిక్ అయింది అంటే… ఆమె మళ్ళీ నటిస్తోంది. తాజాగా సుశాంత్ సరసన ఒక వెబ్ సిరీస్ చేసింది. జూలై 15 నుండి సుశాంత్ – ప్రియా ఆనంద్ నటించిన “మా నీళ్ల ట్యాంక్ ” అనే వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమ్ కానుంది. దాంతో, ఆమె మీడియా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్ పెద్ద వార్త అయింది.

గతంలో పలువురు హీరోలతో డేటింగ్ చేసింది ప్రియా ఆనంద్. ఒక హీరోని పెళ్లి చేసుకోబోతుందని ఒక ఐదేళ్ల క్రితం పుకార్లు షికార్లు చేశాయి. 35 ఏళ్ల ఈ భామ ఇంకా సింగిల్ గానే ఉంది.

 

More

Related Stories