త్వరలోనే తెలుగులో మాట్లాడుతా: ప్రియా

Priya Prakash

ప్రియా ప్రకాశ్ వారియర్ గురించి ఇంట్రడిక్షన్ అవసరం లేదు. ఈ కేరళ కుట్టి ఇండియా అంతా పాపులర్. నితిన్ సరసన ‘చెక్’ సినిమాలో నటించింది. తెలుగులో ఆమెకిదే ఫస్ట్ మూవీ. ప్రియా ప్రకాశ్ వారియర్ తో ఇంటర్వ్యూ…

ఎలా వుంది టాలీవుడ్?
నేను నటించిన స్ట్రయిట్ తెలుగు సినిమా ‘చెక్’. తెలుగు నుంచి చాలా అవకాశాలు వచ్చాయి. అయితే, మంచి కథ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ‘చెక్’ వచ్చింది. మరో ఆలోచన లేకుండా అంగీకరించా. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ‘మనమంతా’ చూశా. తెలుగు కాదు… మలయాళంలో. అక్కడ ‘విస్మయం’ పేరుతో విడుదలైంది. అందులో నా అభిమాన హీరో మోహన్ లాల్ నటించడంతో మిస్ కాలేదు. ఆ సినిమా చూసినప్పుడు చందూ సార్ ఎంత గొప్ప డైరెక్టర్ అనేది అర్థమైంది. ఆయన ఫోన్ చేసి ‘చెక్’లో నువ్వు నటించాలని అడిగారు. సీనియర్, బ్రిలియంట్ డైరెక్టర్ అడిగారు… పైగా నితిన్, రకుల్ చేస్తున్నారని చెప్పారు. మంచి స్టార్ కాస్ట్, మంచి ప్రొడక్షన్ హౌస్ కనుక హ్యాపీగా ఓకే చేశా.

సినిమాలో మీ రోల్ ఏంటి?
నా పాత్ర గురించి ఎక్కువ చెప్పలేను. కానీ, ఆదిత్య ప్రేయసి యాత్ర పాత్రలో నటిస్తున్నాని చెప్పగలను. ఆదిత్యగా నితిన్ నటించారు.

నితిన్ తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్?
నితిన్ సీనియర్ హీరో. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. అందుకని, బిగినింగ్‌లో టెన్షన్ పడ్డాను. అయితే, సెట్ లో అందరూ నేను కంఫర్టబుల్ గా ఉండేలా చూసుకున్నారు. నితిన్ సీనియర్, నేను న్యూకమర్ వంటి తేడాలు చూపించలేదు.

మీరు పాటలు కూడా పాడుతారట?
సెట్స్ లో ఫ్రీ టైమ్ దొరికితే నాకు పాటలు పాడటం అలవాటు. ఏదో ఒక పాట హమ్మింగ్ చేస్తా. తెలుగులో ప్రయివేట్ సాంగ్ ‘లడీ లడీ’ పాడాను. అవకాశం వస్తే నా సినిమాల్లోనూ పాడాలని అనుకుంటున్నా.

త్వరలోనే తెలుగులో మాట్లాడుతా: ప్రియా

తెలుగు వచ్చేసిందా?
ఇప్పుడు నాతో ఎవరైనా తెలుగులో మాట్లాడితే… వాళ్లు ఏం చెబుతున్నారో అర్థం అవుతుంది. కొంచెం కొంచెం మాట్లాడగలను. తెలుగులో ఇంకొన్ని సినిమాలు చేస్తే పూర్తిగా తెలుగులో మాట్లాడతాను.

ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
తెలుగులో ‘ఇష్క్’ చేస్తున్నా. కన్నడలో ‘విష్ణుప్రియ’ చేశా. అందులో ఓ పాట కూడా పాడాను. హిందీలో ‘శ్రీదేవి బంగ్లా’తో పాటు మరో సినిమాలో నటించా.

‘చెక్’ సినిమా చూశారా?
లేదు. హైదరాబాద్ లో ఫ్యామిలీతో కలిసి చూడాలని అనుకున్నాను. అయితే, 26వ తేదీన తమ్ముడికి ఎగ్జామ్ ఉంది. అందువల్ల, ఫ్యామిలీ హైదరాబాద్ రావడం కుదరడం లేదు. కొచ్చిలో కూడా ‘చెక్’ రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి అక్కడ షోకి వెళ్లే ప్లాన్ చేయాలి.

More

Related Stories