- Advertisement -

ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఇప్పటికే నాని, సుధీర్ బాబు వంటి హీరోలతో సినిమాలు చేశారు. ఇప్పుడు ప్రియదర్శి హీరోగా కొత్త సినిమా రూపొందించే పనిలో ఉన్నారు.
ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించే ఈ కొత్త సినిమాకి సంబంధించి ఒక ప్రకటన వచ్చింది.
మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణ ప్రసాద్ కలయికలో “జెంటిల్ మన్”, “సమ్మోహనం” వంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ప్రియదర్శి హీరోగా సినిమా తీసేందుకు చేతులు కలిపారు. ప్రియదర్శి హీరోగా ‘బలగం’ సినిమాతో ఆయన భారీ విజయం అందుకున్నారు. మార్చి నెలాఖరు నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది.
ఈ సినిమాలో ఎవరు? సంగీత దర్శకుడు ఎవరు? ఇలాంటి వివరాలు త్వరలోనే చెప్తాం అంటున్నారు మేకర్స్.