
కెరీర్ లో తనకు ఎలాంటి కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురుకాలేదంటోంది ప్రియమణి. దీనికి ఆమె ఓ రీజన్ కూడా చెబుతోంది.
“నాకు ఎలాంటి కాస్టింగ్ కౌచ్ చేదు అనుభవాలు ఎదురుకాలేదు. ఎందుకంటే నా కెరీర్ స్టార్టింగ్ లో అమ్మ ఎప్పుడూ నాతోనే ఉండేది. దీంతో ఎవరూ నాతో అభ్యంతరకరంగా ప్రవర్తించలేదు. అమ్మ షూటింగ్స్ కు రావడం మానేసిన టైమ్ కు ఇండస్ట్రీలో నేనొక గౌరవప్రదమైన పొజిషన్ కు చేరుకున్నాను. అప్పటికే నాకు జాతీయ అవార్డ్ వచ్చింది. అందరూ గౌరవించడం మొదలుపెట్టారు. కాబట్టి అప్పుడు కూడా ఎవ్వరూ నాతో మిస్-బిహేవ్ చేయలేదు.”
Also Check Latest Pics: Priyamani
ఇక ఇప్పుడైతే ఎవ్వరూ తనను కాస్టింగ్ కౌచ్ కోణంలో చూడరని… ఎందుకంటే తనకు పెళ్లవ్వడంతో పాటు.. తన భర్త పక్కనే ఉంటాడని చెబుతోంది ప్రియమణి. ప్రస్తుతం ఈ హీరోయిన్ డేట్స్ వ్యవహారాలన్నీ ఈయనే చూసుకుంటున్నాడట.