కర్ర ఆంటీ అంటూ ట్రోల్ చేశారట

Priyamani


‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్-డీకే, హీరో మనోజ్ బాజ్ పేయిలతో పాటు ఇందులో విలన్ గా నటించిన సమంతకి ఏంతో పేరు తెచ్చిపెట్టింది. మనోజ్ బాజ్ పేయి భార్యగా నటించిన ప్రియమణికి కూడా నార్త్ ఇండియాలో క్రేజ్ పెరిగింది.

ప్రియమణి మన తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది. ఆమె నటన గురించి మనందరికీ తెలుసు. ఇప్పుడు హిందీ ప్రేక్షకులు ఆమె గురించి తెలుసుకుంటున్నారు. ఆమె నటన తెగ పొగుడుతున్నారు. ఆమె అందం గురించి కూడా మాట్లాడుతున్నారు.

ప్రియమణి ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా తన పర్సనల్ లైఫ్ కి సంబందించిన పలు విషయాలు బయటపెట్టింది. అలాగే, కొన్నాళ్ల క్రితం ట్విట్టర్లో తనని ఎలా ట్రోల్ చేసేవారో చెప్పుకొచ్చింది. “కర్రదానా’, ‘నల్ల పిల్లి’, ‘ఫ్యాట్ అంటి’ అంటూ ఎగతాళి చేసేవారట. అందుకే తాను ట్విట్టర్ నుంచి తప్పుకున్నాను అని చెప్తోంది. ప్రస్తుతం ఆమె ఇన్ స్టాగ్రామ్ లో మాత్రమే ఉంది.

Priyamani

అప్పుడు ఎగతాళి చేసినవారే ‘మస్త్’గా ఉన్నావు అంటూ ఇప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారట.

 

More

Related Stories