
భర్త ముస్తఫాతో తన బంధం గట్టిగానే ఉందంటున్నారు ప్రియమణి. “మాది బలపడిన బంధం. ఎటువంటి సమస్య లేదు” – ఇది ప్రియమణి మాట. ఆమె భర్త ముస్తఫా ఇంతకుముందు అయేషా అనే ఆవిడని పెళ్లి చేసుకున్నారు. “నాకు విడాకులు ఇవ్వకుండానే ప్రియమణిని పెళ్లాడాడు ముస్తఫా. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. నేను ముస్తఫాకి భార్యని… ప్రియమణి కాదు,” అని అయేషా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.
దాంతో ప్రియమణి స్పందించారు. అయేషా పేరు ఎత్తకుండా తన భర్త ముస్తఫాతో ఉన్న బంధం గురించి ప్రియమణి మాట్లాడ్డం విశేషం. ఆమె భర్త ఇప్పుడు అమెరికాలో ఉన్నారట. పని మీద కొన్నాళ్లుగా అక్కడే ఉంటున్నారట. “ఐతే, ప్రతి నిత్యం మాట్లాడుకుంటాం. టచ్ లో ఉంటాం,” అంటూ ప్రియమణి చెప్తున్నారు.
ప్రియమణి స్టేట్ మెంట్ ఎక్కడా అయేషా చేసిన ఆరోపణలకు స్పందన అన్నట్లుగా లేదు. తనకి విడాకులు ఇవ్వకుండానే తన భర్త ప్రియమణిని పెళ్లాడాడు కాబట్టి వారి పెళ్లి చెల్లదు అనేది అయేషా అంటున్న మాట. దాని గురించి ప్రియమణి మాట్లాడడం లేదు.
ALSO CHECK: Priyamani in a pink Saree
ఐతే, ముస్తఫా వాదన మరోలా ఉంది. తమ విడాకుల వ్యవహారం 2013లోనే ముగిసింది అని ముస్తఫా అంటున్నారు. ఆమెకి, పిల్లలకు రెగ్యులర్ గా మని ఇస్తున్నాను అని చెప్తున్నారు. మరింత డబ్బుల కోసం ఆమె ఇలా చేస్తోందనేది ముస్తఫా ఆరోపణ.

ముస్తఫా, ప్రియమణి 2017లో పెళ్లి చేసుకున్నారు. ప్రియమణి మళ్ళీ సినిమాలతో బిజీగా మారారు. ఇటీవలే ‘నారప్ప’లో వెంకటేష్ కి భార్యగాకనిపించగా, త్వరలోనే ‘విరాటపర్వంలో’ కూడా కీలక పాత్రలో దర్శనమిస్తారు.