డబ్బులిచ్చి తీయించుకుంటారు: ప్రియమణి

- Advertisement -
Priyamani

హీరోయిన్ ప్రియమణి బాలీవుడ్ హీరోయిన్లకు సంబంధించిన ఒక రహస్యాన్ని బయటపెట్టింది. బాలీవుడ్ హీరోయిన్లు అందరూ డబ్బులిచ్చి తమకు తెగ క్రేజ్ ఉందని ప్రూవ్ చేసుకొనే ప్రయత్నం చేస్తారట. తాము ఎక్కడికి వెళ్లినా ఫొటోగ్రాఫర్లు (పాపారాజి) వెంటబడుతున్నట్లు చూపించుకుంటారట.

పాపారాజి వెంటపడి ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, వాటిని షోషల్ మీడియాలో షేర్ చెయ్యడం… ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందట. ఈ పాపరాజిలకు నెలకు ఇంత అని డబ్బులు ఇచ్చి, తాము ఎక్కడికి వెళ్తున్నామో ఫోన్లో చెప్పి ఇలా పబ్లిసిటీ చేసుకుంటారని ప్రియమణి తాజాగా బయటపెట్టింది.

ప్రియమణి ఇటీవల బాలీవుడ్ లో కొన్ని సినిమాలు (జవాన్), కొన్ని హిందీ వెబ్ సిరీస్ లలో నటించింది. అప్పుడు ఆమెని కూడా కొన్ని ఏజెన్సీలు కలిశాయట. మీరు ఇంత డబ్బు ఇస్తే ఇంతమంది పాపారాజి మీ ఇంటి వద్దకు వస్తారు. ఎయిర్పోర్ట్ వద్ద వచ్చినప్పుడు, పోయినప్పుడు తీస్తే ఇంత రేట్, జిమ్ కి వెళ్ళినపుడు, బయట ఎక్కడికి వెళ్లినా ఫోటోలు, వీడియోలు తీస్తే మరో రేట్ అంటూ ఆ ఏజెన్సీ ఒక ధరల పట్టిక చెప్పిందట.

కానీ తనకు అలాంటి పబ్లిసిటీ అవసరం లేదని చెప్పి ఒప్పుకోలేదట. బాలీవుడ్ లో దాదాపు అందరూ హీరోయిన్లు ఇలాగే డబ్బులు ఇచ్చి తమ ఫోటోలు, వీడియోలు తీయించుకుంటారు అనే విషయాన్ని ఈ భామ బయటపెట్టింది.

 

More

Related Stories