ఒకటి రద్దు, మరోటి సగంలో ఆగింది

Priyanka Mohan

హీరోయిన్ ప్రియాంక మోహన్ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. దానికి కారణం ఆమెకి గతేడాది సడెన్ గా పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం రావడమే.

ప్రియాంక మోహన్ ని తమ సినిమాలో తీసుకున్నామని “ఓజి” మేకర్స్ ప్రకటించిన వెంటనే ఆమె జీవితం, కెరీర్ మారిపోయింది. వరుసగా మరో నాలుగు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. అందులో రెండు తెలుగు, రెండో తమిళం. “ఓజి” షూటింగ్ మొదలుకాగానే ఈ భామకి నాని సరసన ఒక మూవీ, రవితేజ సరసన మరో మూవీలో ఛాన్స్ వచ్చింది.

ఐతే, ఆ అవకాశాలతో పాటు అడ్డంకులు కూడా వచ్చాయి.

ప్రియాంక మోహన్ గతేడాది ఒప్పుకున్న మూడు తెలుగు చిత్రాలు ఏంటంటే… 1) ఓజి 2) సరిపోదా శనివారం 3) రవితేజ – గోపీచంద్ మలినేని మూవీ.

ఇందులో “ఓజి” సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకొంది. ఐతే ఎన్నికల కారణంగా పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లను పక్కన పెట్టేశారు. ఆంధ్రపదేశ్ ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు పవన్ కళ్యాణ్ సినిమాల వైపు చూపు వెయ్యరు. అలా “ఓజి” మధ్యలో ఆగింది.

ఇక రవితేజ – గోపీచంద్ మలినేని చిత్రంలో ప్రియాంకని తీసుకున్నప్పటికీ ఆమెకి అడ్వాన్స్ ఇవ్వలేదు. ఆమె పేరు కూడా ప్రకటించలేదు. ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ తడిసి మోపెడు అయ్యేలా ఉందని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దాన్ని ఆపేసింది. సినిమాకి ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జరిగింది. కానీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే టైములో ఆగింది. అలా ఈ సినిమా కూడా పోయింది ప్రియాంకకి.

Priyanka Mohan

ప్రస్తుతం ఆమె షూటింగ్ తో బిజీగా ఉన్నది ఒక్క నాని చిత్రంతోనే. “గ్యాంగ్ లీడర్” చిత్రంలో ప్రియాంక మోహన్ నాని సరసన నటించింది. మళ్ళీ ఇప్పుడు నాని సరసన “సరిపోదా శనివారం” అనే సినిమాలో నటిస్తోంది.

 

More

Related Stories