- Advertisement -

ప్రియాంక మోహన్ ముద్దుగా, అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంటుంది. ఐతే, ఈ అమ్మాయికి హిట్స్ మాత్రం వరించడం లేదు. నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటించింది. అది ఆడిందని చెప్పలేం, పోయిందనలేం. అలాంటి మూవీ అది. రీసెంట్ గా శర్వానంద్ సరసన ‘శ్రీకారం’ సినిమాలో నటించింది. సినిమాకి కొంత పేరు వచ్చినా… కమర్షియల్ గా ఆడలేదు.
ఈ సుందరికి తొలి రెండు తెలుగు సినిమాలు విజయాలు ఇవ్వలేదు. అయినా, ఇంకా ఆఫర్లు పొందుతూనే ఉంది. రామ్ హీరోగా లింగుస్వామి డైరెక్షన్లో రూపొందే సినిమాలో రెండో హీరోయిన్ గా ఈ భామని అనుకుంటున్నారట. మెయిన్ హీరోయిన్ గా ఇప్పటికే ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టిని తీసుకున్నారు.
ఆమె నిజంగా సైన్ చేస్తే… లక్ ఉన్న భామ అని చెప్పాలి.