విజయ్ ని చూసే నేర్చుకున్నా: ప్రియాంక

విజయ్ ని చూసే నేర్చుకున్నా: ప్రియాంక

ప్రియాంక చోప్రా ఆత్మకథ “అన్ ఫినిషిడ్” మార్కెట్లోకి వచ్చింది. ఈ బుక్ లో తన కెరీర్ ప్రారంభం గురించి ఎక్కువగా రాసుకొంది. ఇప్పటివరకు చూసిన ఎత్తుపల్లాల గురించి ఎక్కువగా వివరించింది. ఇక, తమిళ్ సూపర్ స్టార్ విజయ్ గురించి ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయించిందని బుక్ రివ్యూస్ చెప్తున్నాయి. ఆమె తొలి చిత్రం ‘తమిళన్’. ఆ మూవీ హీరో విజయ్. అప్పటికే విజయ్ పెద్ద హీరోగా తన ప్లేస్ ని సెట్ చేసుకున్నాడు.

విజయ్ ని చూసి చాలా నేర్చుకున్నాను అని చెప్తోంది. “సెట్ లో దాదాపు 12, 14 గంటల పాటు వర్క్ చేసేవాళ్ళం. వర్క్ అయిపోయిన తర్వాత తనకోసం వచ్చిన అభిమానులతో గంటపాటు గడిపేవాడు. వారితో ఓపికగా ఫోటోలు దిగడం, ఆటోగ్రాఫ్ లు ఇవ్వడం చేసేవాడు. ఆయన ఓపికని చూసి అప్పట్లో ఆశ్చర్యపోయాను. నేను స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నాక ఆ అనుభవం గుర్తు చేసుకున్నా. నేను కూడా అదే ఫాలో అయ్యాను. ఆ విధంగా విజయ్ నాకు స్ఫూర్తి,” అంటూ ప్రియాంక విజయ్ గురించి తెగ పొగిడేసిందట ఆ పుస్తకంలో.

ప్రియాంక ఇలా తమ దళపతి గురించి గొప్పగా రాసిందన్న వార్తలతో విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ప్రియాంకకి థాంక్స్ చెప్తూ ట్రెండింగ్ షురూ చేశారు.

More

Related Stories