- Advertisement -

ప్రియాంక చోప్రాకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. అమెరికాలో ఆమెకి మరింత పాపులారిటీ ఉంది. అమెరికా పాప్ సింగర్ నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడింది. అమెరికన్ వెబ్ డ్రామాలు, సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా సంపాదన ఏ మాత్రం తగ్గలేదు.
ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఏదైనా ఒక కమర్షియల్ యాడ్ పోస్ట్ చెయ్యాలంటే ఒక్క పోస్ట్ కి 3 కోట్ల రూపాయలు తీసుకుంటుందట. మన బాలీవుడ్ హీరోయిన్లు ఒక్కో పోస్ట్ కి 8 నుంచి పది లక్షలు తీసుకుంటున్నారు. ప్రియాంక అక్షరాలా 3 కోట్ల రూపాయల అందుకుంటోంది.
ప్రియాంక చోప్రాకి ఇన్ స్టాగ్రామ్ లో 65 మిలియన్ల (ఆరున్నర కోట్లు) ఫాలోవర్స్ ఉన్నారు. ప్రియాంక సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకొని యాడ్స్ పోస్ట్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది.