అండర్వేర్ లో డాన్స్ చెయ్యమన్నాడు

Priyanka Chopra


ప్రియాంక చోప్రా మరో షాకింగ్ డీటెయిల్ బయట పెట్టింది. తన కెరియర్ ప్రారంభంలో ఒక దర్శకుడు అండర్ వేర్ మాత్రమే ఉంచుకొని మిగతా బట్టలన్నీ విప్పేసి డ్యాన్స్ చెయ్యమన్నాడని తెలిపింది.

“అన్ ఫినిషిడ్” పేరుతో ఆమె తన ఆత్మకథని రాసింది. ఆ బుక్ ప్రచారంలో భాగంగా ఫేమస్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ ఫ్రె షోలో పాల్గొంది ప్రియాంక చోప్రా. ఆమె ఇంటర్వ్యూలో ఈ విషయాలని చెప్పింది ప్రియాంక.

“ఐతే, వెంటనే నేను ఆ సినిమా వదిలేశాను. కాకపోతే, అప్పుడు నేను ఇండస్ట్రీకి కొత్త. ఆ దర్శకుడు గురించి బయటకి చెప్పేంత ధైర్యం అప్పుడు లేదు. ఇలాంటివి అన్ని బయటకి మాట్లాడితే… ఆమెతో వర్క్ చెయ్యడం కష్టం అనే ముద్ర వేస్తారని నా కొలీగ్స్ చెప్పడంతో అప్పుడు మీడియాకి తెలపలేదు,” అని ప్రియాంక చోప్రా చెప్పింది. సెట్ లో అంతమంది జనం ఉండగా..అండర్ వేర్ వరకు మాత్రమే బట్టలు ఉంచుకో… అని అవమానించాడు ఆ డైరెక్టర్ అని చెప్పిన ప్రియాంక… ఇప్పుడు కూడా ఆ డైరెక్టర్ పేరు బయటపెట్టలేదు.

More

Related Stories