ఆర్.ఆర్.ఆర్.లో ప్రియాంక లేదు!


“ఆర్.ఆర్.ఆర్” సినిమాలో అలియా భట్ స్థానంలో ప్రియాంక చోప్రాని తీసుకున్నారు అనే వార్తల్లో నిజం లేదంట. అలియా భట్ నటించిన “సడక్ 2” ట్రైలర్ కి మిలియన్ల కొద్దీ డిస్ రావడంతో రాజమౌళి ఆలోచనల్లో పడ్డాడని, అలియా భట్ స్థానంలో ప్రియాంక చోప్రాని తీసుకుంటే ఇంటర్నేషనల్ గా ఫోకస్ పడుతుందన్నే ప్రొపోజల్ ఉందని ప్రచారం జరుగుతోంది.

అలియా భట్ ని మార్చడం లేదు అని అంటోంది ఆర్.ఆర్ ఆర్. టీం.

ప్రియాంక చోప్రాని అప్రోచ్ అయ్యామన్న వార్తల్లోనూ నిజం లేదంట. రామ్ చరణ్ సరసన అలియా భట్ అన్నది ఫిక్స్.

గతంలో ప్రియాంక, రామ్ చరణ్ కలిసి జంజీర్ రీమేక్ లో నటించారు. ఆ సినిమా రామ్ చరణ్ కి ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది. రామ్ చరణ్ కెరీర్లో ఆరెంజ్, జంజీర్ …రెండూ అతిపెద్ద డిజాస్టర్లు.

Related Stories