పిల్లలని కనాలని ఉంది కానీ!


ప్రియాంక చోప్రా పెళ్లి జరిగి మూడేళ్లే కావొస్తోంది. కానీ అప్పుడే విడాకుల గురించి పుకార్లు వచ్చాయి. గతేడాది నవంబర్ లో ఆమె తన భర్త ఇంటి పేరుని తన ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి తొలగించింది. దాంతో, వీరి విడిపోతున్నారు అనే ప్రచారం మొదలైంది. తాజాగా ‘వానిటీ ఫెయిర్’ అనే అంతర్జాతీయ మేగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది ప్రియాంక. ఈ ఇంటర్వ్యూలో ఈ పుకార్ల గురించి, తన కాపురం గురించి, పిల్లలను కనే విషయం… ఇలా ఎన్నో విషయాలు వెల్లడించింది.

“సెలెబ్రిటీల జీవితాలు అంతే. సోషల్ మీడియాలో ప్రతి అడుగుని, చర్యని, మార్పుని గమనిస్తారు. వాటిపై ఊహాగానాలు వస్తాయి. నేను ఇంస్టాగ్రామ్ పేరులో మార్పులు చేసింది కేవలం ప్రొఫెషనల్ కారణాల వల్లే. నా కాపురం సజావుగానే సాగుతోంది,” అని క్లారిటీ ఇచ్చింది.

మరి, పిల్లలను కనే ఆలోచనలో ఉన్నారా? “కనాలని ఉంది కానీ… చూద్దాం ఎప్పుడు అవుతుందో,” అని వేరైటీగా సమాధానం ఇచ్చింది ప్రియాంక.

ప్రియాంక చోప్రాకిప్పుడు 39 ఏళ్ళు. ఆమె భర్త నిక్ జోనాస్ కి 29 ఏళ్ళు. ఆమె కన్నా 10ఏళ్ళు చిన్నవాడు. ఆమె బయోలజికల్ క్లాక్ తిరుగుతోంది. సో ఆమెపై పిల్లల విషయంలో ఒత్తిడి కనిపిస్తోంది.

 

More

Related Stories