అయోధ్యలో ప్రియాంక పూజలు

అమెరికాలో స్థిరపడ్డ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తాజాగా ఇండియా వచ్చింది. భర్త నిక్ జోనస్, కూతురు మాల్ట్ మేరీతో కలిసి ఈ రోజు ఆమె అయోధ్య వెళ్లి అక్కడ పూజలు చేశారు.

అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆమెకి ఆహ్వానం అందింది కానీ అప్పుడు ఆమె రాలేకపోయారు. ఇప్పుడు ఇండియాకి రాగానే ఆమె రామ మందిరాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆమె భర్త అమెరికాకి చెందిన ఫేమస్ పాప్ సింగర్. పైగా క్రైస్తవుడు. అయినా భార్యతో కల్సి పూజల్లో పాల్గొనడం విశేషం.ప్రియాంక తన కూతురుని చంకలో ఎత్తుకొని మీడియా ముందుకురావడం మరో విశేషం.

రామ మందిర నిర్మాణం అద్భుతంగా ఉందని కొనియాడింది ప్రియాంక.

Advertisement
 

More

Related Stories