
అనుష్క శర్మ ఇటీవలే ఒక బిడ్డకి జన్మనిచ్చింది. కరోనా కపూర్ రెండోసారి తల్లి కాబోతోంది. దాంతో 38 ఏళ్ల ప్రియాంక చోప్రాని ఇప్పుడు అందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారట. “పిల్లలని కనండి. ఇంకా లెట్ చెయ్యద్దు” అని తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఆమెకి సలహాలిస్తూ చికాకు పెడుతున్నారట.
ఈ విషయంలో ఆమె స్పందించింది. “పిల్లలని కనమంటూ ప్రెజర్ పెట్టడం సరి అయిన పద్దతి కాదు. ఎప్పుడు కనాలో ఎవరికీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సమాజం, బంధువులు, ఫ్రెండ్స్ అదే ప్రశ్నలు అడగొద్దు,” అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఐతే, ఆమె బయోలాజికల్ క్లాక్ గురించి ఆలోచించాలి కదా అని ఆమె ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అంటున్నారు. ఆమె 40కి దగ్గర్లో ఉందన్న విషయాన్ని ప్రియాంకకి వాళ్ళు గుర్తుచేస్తున్నారట.
ప్రియాంక చోప్రా, అమెరికాకి చెందిన నిక్ జోనస్ ని రెండేళ్ల క్రితం పెళ్లాడింది. అతను ఆమెకన్నా పదేళ్ల చిన్నవాడు.