బీచ్ లో 40వ బర్త్ డే సంబరం

- Advertisement -

ప్రియాంక చోప్రా తన 40వ పుట్టిన రోజు బీచ్ లో జరుపుకొంది. జులై 18న ఆమె పుట్టిన రోజు. భర్త నిక్ జోనస్ తో కలిసి ఆమె ప్రస్తుతం వెకేషన్ లో ఉంది. బీచ్ రిసార్ట్ లో ఆమె పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.

ఆ ఫోటోలని షేర్ చేసింది. బీచ్లో తన భార్యని ముద్దుతున్న ఫోటోని నిక్ జోనస్ షేర్ చేశాడు. ఇక “80ల బేబీని” అనే ప్లేకార్డు పట్టుకున్న ఫోటోని ప్రియాంక చోప్రా షేర్ చేసింది. “జులైలో పుట్టిన జువెల్. 1982లో స్థాపితం” అనే మరో కొటేషన్ ని చెప్పుకొంది తనకిప్పుడు 40 అని చెప్పుకోవడానికి.

ప్రియాంక చోప్రా ఇటీవలే తల్లి అయింది. సరోగసి ద్వారా ఒక పాపకి జన్మనిచ్చింది. కూతురుకి మాల్టీ మేరీ చోప్రా జోనస్ అనే పేరు పెట్టారు. 2018లో ప్రియాంక, నిక్ పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్త ఆమె కన్నా 10 ఏళ్ళు చిన్నవాడు. ఆమె 40లోకి ఎంట్రీ ఇస్తే, అతను ఈ సెప్టెంబర్ లో 30లోకి అడుగుపెడతాడు.

ప్రస్తుతం ప్రియాంక బాలీవుడ్ సినిమాలు ఏవీ చెయ్యడం లేదు. ఒక హాలీవుడ్ చిత్రం మాత్రం సెట్స్ పై ఉంది.

 

More

Related Stories