- Advertisement -

సోమవారం న్యూయార్క్ లో జరిగిన మెట్ గాలా 2023 ఈవెంట్ లో అలియా భట్ తో పాటు మరో ఇండియన్ స్టార్ పాల్గొన్నారు. ఆమె ఎవరో కాదు ప్రియాంక చోప్రా. అలియా భట్ లక్ష ముత్యాలతో తయారు చేసిన గౌన్ ధరిస్తే… ప్రియాంక చోప్రా కాళ్ళు కనిపించే బ్లాక్ గౌన్ వేసుకొని ఈ ఈవెంట్ లో పాల్గొంది.
ఇది ఫ్యాషన్ ఈవెంట్. ఐతే, ప్రియాంక చోప్రా డ్రెస్ కన్నా ఆమె మెడలో ధరించిన ఆభరణంపైనే అందరి కళ్ళు నిలిచాయి.
అవును…. ఆమెమెడలో వేసుకున్న డైమండ్ ధర అక్షరాలా 204 కోట్ల రూపాయలు. ఈ డైమండ్ ని వేలం వేసి అమ్ముతారట. 250 కోట్లకు పైనే వేలం వేసే అవకాశం ఉంది.
తన మెడలో ఈ డైమండ్ నెక్ లెస్ పడగానే ప్రియాంక ఉబ్బితబ్బిబ్బు అయింది.
ALSO READ: Alia Bhatt attends the Met Gala in a gown with 10,000 pearls