- Advertisement -

తెలుగు భామ… ప్రియాంక జవల్కర్ కూడా అందాల ఆరబోతకు సిద్ధం. అంతేకాదు, ముద్దులు, ఇంకా బోల్డు సీన్లకు కూడా రెడీ అని చెపుతోంది.
“కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రనైనా చేస్తాను. బోల్డ్ కారెక్టర్ కూడా చేస్తాను.ఇలాగే నటించాలి అని మడి కట్టుకోలేదు,” అని క్లారిటీ ఇచ్చింది. ఆమె నటించిన కొత్త చిత్రం… ‘గమనం’. ఈ సినిమా ఈ వీకెండ్ విడుదల కానుంది.
ఇంతకుముందు, ‘టాక్సీవాలా’, ‘తిమ్మరుసు’, ‘ఎస్ ఆర్ కళ్యాణ్ మండపం’ వంటి చిత్రాలు చేసింది. ఆ రెండు సినిమాల్లో ఆమె చాలా లావుగా కనిపించింది. ఆ కామెంట్స్ తో ఆమె ఇప్పుడు సన్నబడింది.
“ఎస్ఆర్ కళ్యాణమండపం, తిమ్మరుసు హిట్ అవుతాయని నేను కూడా అనుకోలేదు. గమనం మాత్రం హిట్ అవుతుందని అనుకుంటున్నాను,” అని చెప్తోంది.