అక్కడికి, ఇక్కడికి ఎంత తేడా!

Priyanka Jawalkar

ప్రియాంక జవాల్కర్… తెలుగు అమ్మాయి. ‘ట్యాక్సీవాలా’ సినిమాతో పాపులర్ అయింది. లేటెస్ట్ గా ఆమె నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి ‘తిమ్మరుసు’, రెండోది ‘SR కల్యాణమండపం’. 8 రోజుల గ్యాప్ లో రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది ఈ అనంతపురం అమ్మడు.

బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు విడుదలైన ఆమెకి పెద్దగా ప్లస్ కాలేదు. ఎందుకంటే… ఈ రెండింటిలోనూ ఆమె అప్పీయరెన్స్ అస్సలు బాగాలేదు. బాగా లావుగా కనిపించడం, మేకప్, స్టైలింగ్ కూడా సరిగా లేకపోవడంతో ఆమె తెరపై కనిపించినప్పుడల్లా కామెంట్స్ పడ్డాయి.

అంతెందుకు, రెండు సినిమాలోనూ హీరోతో ఆమె ‘బరువు’ గురించి డైలాగ్స్ పెట్టారు. ‘తిమ్మరుసు’లో ఒక సీన్లో ఎమోషన్స్ ఎక్కువ అయి… ఎక్కువ తిని బరువు పెరిగినట్లు ఒక డైలాగ్ చెప్పించారు. ఇక ‘కల్యాణ మండపం’లో ఆమె నడుము 24 అంగుళాల నుంచి 32 అంగుళాలకి పెరిగినట్లు హీరో కామెంట్ చేయించి కవర్ చేశారు. అంటే… సినిమా షూటింగ్ టైంలోనే ఆమె బాగా లావు పెరిగింది అని దర్శకులు గ్రహించారన్నమాట.

ఇక, ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం చాలా స్లిమ్ గా కనిపిస్తూ… గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది ప్రియాంక. ఇన్ స్టాగ్రామ్ లో చూసిన తర్వాత వెండితెరపై చూస్తే… ఆమె ఈమె ఒక్కరేనా అన్న డౌట్ వస్తుంది. అంత తేడా ఉంది ఆమె లుక్ లో.

 

More

Related Stories