ప్రియాంకా అరుళ్ మోహన్ ప్రస్తుతం తెలుగులో ఒక బడా సినిమాలో నటిస్తోంది. ఆ మూవీ… ఓజీ. పవన్ కళ్యాణ్ హీరో. పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరో సరసన నటించే ఛాన్స్ రావడం అంటే మాటలు కాదు కదా. తెలుగులో ఇంకా మరో సినిమా చెయ్యడం లేదు కానీ తమిళంలో బిజీగానే ఉంది ఈ ‘గ్యాంగ్ లీడర్’ గాళ్.
ఆమె తాజాగా ఒక తమిళ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసింది. ఆ సినిమా పేరు… కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ. ఈ సినిమాలో ఆమె హీరోయిన్. ఐతే, ఇందులో ఆమె పూర్తిగా డీగ్లామ్ పాత్రలో కనిపిస్తుంది. గుడిసెలో నివసించే పేద యువతి పాత్ర.
తమిళంలో అలాంటి పేద అమ్మాయిగా కనిపిస్తున్న ఈ భామ తెలుగులో మాత్రం రిచ్ గాళ్ గా మెరిసిపోతోంది. “ఓజీ”లో ఆమెది గ్లామరస్ రోల్.
తెలుగులో ప్రియాంక మోహన్ ఇప్పటివరకు “గ్యాంగ్ లీడర్”, “శ్రీకారం” వంటి సినిమాల్లో నటించింది. “ఓజీ” ఆమెకి మూడో తెలుగు చిత్రం.