- Advertisement -

నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటించిన ప్రియాంక అరుళ్ మోహన్ గుర్తుందా? ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆమెకు అవకాశాలు పెద్దగా రాలేదు. ఐతే, “శ్రీకారం” సినిమాలో శర్వానంద్ సరసన నటిస్తోంది. ఆ సినిమా విడుదల తర్వాత తెలుగులో ఆమెకి మరిన్ని ఆఫర్లు వస్తాయేమో చూడాలి.
తమిళ సినిమా పరిశ్రమలో మాత్రం ఆమె ఒక బంపర్ అఫర్ కొట్టినట్లే కనిపిస్తోంది.
సూర్య సరసన ఆమె నటించనుందట. “ఆకాశం నీ హద్దు రా” తర్వాత సూర్య ఒప్పుకున్న కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. పాండిరాజ్ డైరెక్షన్లో రూపొందే ఈ మూవీలో ప్రియాంక మోహన్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని టాక్. ఇదే నిజమైతే, ఆమె దిశ తిరుగుతుంది. ఎందుకంటే… సూర్య పెద్ద హీరో. ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతాయి.