‘చిన్నగా ఉన్నాయి, సర్జరీ చేయించుకో’

Priyanka Chopra Jonas

ప్రియాంక చోప్రా అప్పుడే ఆత్మకథ విడుదల చేస్తోంది. “అన్ ఫినిషిడ్” పేరుతో ఆమె ఆటోబయోగ్రఫీ తీసుకొచ్చింది. త్వరలోనే మార్కెట్లోకి రానుంది.

దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టింది. “తమిళన్” (2002) అనే సినిమా ఆమె ఫస్ట్ మూవీ. అదే టైంలో తెలుగులో కూడా “అపురూపం” అనే సినిమాలో కూడా అవకాశాన్ని పొందింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తన కెరీర్ జర్నీ గురించి, తన జీవితంలోని కీలక ఘట్టాల గురించి ఈ ఆత్మకథలో రాసిందిట ప్రియాంక చోప్రా జోనాస్.

కెరీర్ స్టార్టింగ్ లో తన అవయవ సౌష్టవం గురించి కొందరు నిర్మాతలు, దర్శకులు చేసిన కామెంట్లు కూడా ఇందులో రాసుకొంది. “నా ఫీజికల్ అప్పీయరెన్స్ పైనే నా కెరీర్ నిర్మాణమైంది. కానీ పునాదులు పడకముందే కుప్పకూలినట్లు అనిపించింది, ఒక అందమైన స్వర్గానికి తలుపులు తెరిచినట్లే తెర్చి మూసివెయ్యబడుతున్న ఫీలింగ్ కలిగింది. అలాంటి చేదు అనుభవాలు మొదట్లోనే ఎదురయ్యాయి. ఎంతో బాధపడ్డాను,” అంటూ తొలినాళ్లల్లో పడ్డ అవమానాల గురించి రాసుకొంది.

“ఒక ఆఫీస్ కి వెళ్ళాను. ఆ దర్శక, నిర్మాత అటు ఇటు తిరుగుమన్నారు. అలా రౌండ్ గా తిరిగాను. నా బాడీని చూసి వక్షోజాలు చిన్నగా కనిపిస్తున్నాయి. అలాగే పిరుదులు కొంచెం పెద్దగా ఉన్నాయి. సర్జరీ చేయించుకో అని చెప్పాడు. అందెగత్తెగా గెలిచి వచ్చిన నాకు ఆ మాటతో కుంగిపోయాను,” అంటూ స్టార్టింగ్ లో తన కష్టాలు, అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచిందట.

అయితే, ఆమె చెప్పిందాంట్లో నిజం పాలు తక్కువ అనేది ఆమె కెరీర్ స్టార్టింగ్ నుంచి అబ్జార్వ్ చేస్తున్న సినిమావాళ్ళకి, జర్నలిస్టులకు తెలుసు.

More

Related Stories