పూజని నమ్ముకున్న నిర్మాత!

Pooja Hegde


GA2 Pictures బ్యానర్ పై సినిమాలు తీసే నిర్మాత బన్నీవాసుకి రీసెంట్ గా గట్టి దెబ్బ తగిలింది. కార్తీకేయ హీరోగా తీసిన ‘చావు కబురు చల్లగా’ ఘోరంగా పరాజయం పాలు అయింది. ఇప్పుడు, ‘మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్’ తీశారు బన్నీవాసు. ఈ సినిమా అనేకసార్లు రీషూట్లు జరుపుకొని, ఎన్నో కరెక్షన్లు చేసుకొని, అనేక సార్లు వాయిదాపడి…  మొత్తానికి మన ముందుకు రానుంది.

అఖిల్, పూజ హెగ్డే హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ లేదు. అఖిల్ ఇంతకుముందు చేసిన సినిమాలు అన్నీ పరాజయాలే. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ హిట్ ఇచ్చి చాలా ఏళ్ళు అవుతోంది. ఈ మొత్తం టీంలో క్రేజున్న వారు ఎవరంటే… పూజ హెగ్డే. యూత్ లో, మాస్ లో ఈ భామకున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.

అందుకే, నిర్మాత ప్రచారానికి ఆమెని నమ్ముకున్నాడట. ఇప్పటికే పోస్టర్లలో ఆమె కాళ్ళు హైలెట్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. పూజ హెగ్డేకి ఉన్న క్రేజ్, ఇటీవల వైరల్ అయిన సిద్ శ్రీరామ్ పాట ఈ సినిమాకి ఓపెనింగ్స్ తెస్తే చాలు అనుకుంటున్నారు నిర్మాత. ఇంతకుముందు ‘చావు కబురు చల్లగా’ సినిమాకి అల్లు అర్జున్ వచ్చి హడావుడి చేసినా ఓపెనింగ్ రాలేదు.

'Most Eligible Bachelor' movie still

మరి ఈ నిర్మాతని పూజ హెగ్డే గట్టెక్కిస్తుందా అన్నది చూడాలి.

 

More

Related Stories