త్వరలోనే అఖండ 2: నిర్మాత మిర్యాల

Miryala Ravinder Reddy

“అఖండ” సినిమాతో పాపులర్ అయ్యారు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. అంతకుముందు బోయపాటి డైరెక్షన్ లోనే “జయ జానకి నాయక” అనే సినిమా నిర్మించారు కానీ, ఆయనికి భారీ సక్సెస్, బాగా పేరు వచ్చింది మాత్రం “అఖండ”తోనే. గ్రానెట్స్, ఐరన్ వ్యాపారం నుంచి వచ్చిన మిర్యాల ఇప్పుడు “పెద్ద కాపు -1” అనే సినిమా నిర్మించారు. ఇందులో హీరోగా నటించిన విరాట్ ఆయన బావమరిదినే.

పెద్ద నిర్మాత అయి ఉండి కొత్త వాళ్ళతో సినిమా చెయ్యడం విశేషం. “దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రాసుకున్న కథలో చాలా దమ్ము ఉంది. ఈ కథకు కొత్తవాళ్లే కావాలి. ప్రతి కథలో బలవంతుడు బలహీనుడు మధ్య పోరాటం వుంటుంది. ఇందులో డెప్త్ మాత్రం చాలా ఎక్కువ. సినిమాలా కాకుండా నిజ జీవితాన్నే తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది. శ్రీకాంత్ గారు రాసిన మాటలు ఆలోచింపచేస్తాయి. జీవితంలో నెగ్గాలంటే ఒక సామాన్యుడు ఇంతపోరాటం చేయాలా అనిపిస్తుంది,” అని అన్నారు మిర్యాల.

ఐతే, హీరో తన బావమరిది కాబట్టి సినిమా తీయలేదు అంటున్నారు. “కథకి హీరోగా కొత్తవాడు కావాలి. సత్యానంద్ వద్ద ట్రైనింగ్ తీసుకున్న విరాట్ బాగుంటాడు అనిపించింది. మా కుటుంబానికి చెందిన వాడు అని హీరోగా తీసుకోలేదు,” అనేది మిర్యాల మాట.

అలాగే కథ అనుకున్నప్పుడే రెండు భాగాలుగా సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారట.

“కాపు” అనే కులం పేరు టైటిల్లో ఉన్నా ఈ సినిమా ఏ సామజిక వర్గాని అనుకూలంగానే, వ్యతిరేకంగానో తీయలేదు అంటున్నారు రవీందర్ రెడ్డి.

“అఖండ 2 కూడా ఉంటుంది. బాలయ్య గారు ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడే. అఖండ 2 కాకుండా అడివి శేష్ గారితో ఒక సినిమా తీయబోతున్నాం. అలాగే మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ చర్చల్లో ఉన్నాయి,” అని తెలిపారు నిర్మాత.

Advertisement
 

More

Related Stories