నిర్మాతలే అవార్డు ఇచ్చేశారు!

Kangana


సైమా అవార్డులు అని ఒక ప్రైవేట్ అవార్డుల కార్యక్రమం ఉంది. ఈ అవార్డులు నిర్వహించే వారు సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రలు, తలైవి, హిందీలో ’83’ వంటి సినిమాలకు సహ నిర్మాతలుగా వ్యవహరించారు.

ఇక తాజాగా నిర్వహించిన అవార్డుల్లో ‘తలైవి’ చిత్రంలో నటించిన కంగనాకి ఉత్తమ నటిగా అవార్డు ఇవ్వడం నవ్వుల పాలు అయింది. సినిమా నిర్మించింది వాళ్లే… అవార్డు ఇచ్చింది వాళ్లే. అట్లుంటవి మనోళ్ల అవార్డులు.

‘తలైవి’లో కంగన రనౌత్ నటనని తప్పు పట్టలేం. ఆమె బాగా నటించింది. కానీ, నిర్మాతలే అవార్డులు ఇవ్వడం అనేది విచిత్రం కదా. ఈ మొత్తం అవార్డులు అన్ని అలాగే ఉన్నాయి.

మరోవైపు కంగనా రనౌత్ వచ్చే ఏడాది జాతీయ అవార్డులలో కూడా అవార్డు కొట్టేయడం ఖాయమనిపిస్తోంది అనే కామెంట్స్ ఉన్నాయి.

 

More

Related Stories