అఖిల్ తో మళ్ళీ అదే తప్పు!

Akhil

అఖిల్ అక్కినేనికి సరైన బ్లాక్ బస్టర్ ఇప్పటి వరకు పడలేదు. యావరేజ్ చిత్రాలు ఉన్నాయి. కానీ నటించిన ఐదు చిత్రాల్లో ఒక్కటీ బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు. పైగా భారీ ఖర్చుతో తీసిన “ఏజెంట్”, “అఖిల్” వంటి చిత్రాలు అంతే భారీగా నష్టాలను మిగిల్చాయి.

అఖిల్ తో కథాబలం ఉన్న మీడియం రేంజ్ సినిమాలు మాత్రమే తీయాలి, సాలిడ్ హిట్ పడిన తర్వాతే భారీ బడ్జెట్ మూవీ చెయ్యాలి అనేది ట్రేడ్ వర్గాల మాట. కానీ నిర్మాతలు మాత్రం అతని రేంజ్ మామూలుది కాదు అని భావిస్తున్నారు. “ఏజెంట్” వంటి భారీ ఫ్లాప్ తర్వాత కూడా కొన్ని నిర్మాణ సంస్థలు అఖిల్ పై గట్టి నమ్మకంగా ఉన్నాయి.

అఖిల్ తదుపరి చిత్రం కూడా 70 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుందట. యువు క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించనుంది. కొత్త దర్శకుడు తీసే ఈ సినిమాలో గ్రాఫిక్స్ వగైరా భారీగా ఉంటాయట. అందుకే ఖర్చు అంత కానుంది. యువి సంస్థ ఇటీవలే “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”తో విజయాన్ని అందుకొంది. దాంతో, అఖిల్ తో భారీగా తీయాలని ఫిక్స్ అయిందట.

ఈ సినిమాకి “ధీర” అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మరి అఖిల్ ఈసారి అయినా “భారీ” బడ్జెట్ కి తగ్గ హిట్ ఇస్తాడా?

Advertisement
 

More

Related Stories