ఫిబ్రవరి నుంచి పుష్ప 2: నిర్మాతలు

- Advertisement -


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన మూవీ… పుష్ప. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈనెల 17న విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాతలు నవీన్  యెర్నేని, వై.రవిశంకర్‌ మీడియాతో ముచ్చటించారు. మైత్రీ మూవీమేకర్స్ సీఇవో చిరంజీవి (చెర్రీ) కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

వారు చెప్పిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే…

  • సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలు (నిమిషం తక్కువ మూడు గంటలు).
  • ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో కలిపి మూడువేల థియేటర్స్‌లో విడుదల.
  • పాన్ ఇండియన్ సినిమా చేయాలనే మా కల నెరవేరింది.
  • అల్లు అర్జున్ నటన అద్భుతం. గత చిత్రాలకు భిన్నంగా కొత్త పంథాలో అల్లు అర్జున్. బన్నీ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది.
  • స్క్రీన్‌ప్లే రేసీగా ఉంటుంది. మలయాళ సూపర్ స్టార్ ఫహాద్‌ ఫాజిల్ మా అందరి ఊహలకు మించి అద్భుతంగా నటించారు.
  • పుష్ప సెకండ్‌పార్ట్ షూటింగ్‌ను ఫిబ్రవరిలో మొదలుపెడతాం.
  • ప్రస్తుతం మా సంస్థలో మహేష్‌బాబు “సర్కారువారి పాట”, నానితో “అంటే సుందరానికి” సినిమాలు చేస్తున్నాం. #MEGA154 సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైంది. బాలకృష్ణతో చేయబోతున్న చిత్రాన్ని వచ్చే నెలలో సెట్స్‌పైకి తీసుకొస్తాం. కల్యాణ్‌రామ్‌తో అమిగోస్ అనే చిత్రం  చేయబోతున్నాం.
 

More

Related Stories