ఐరన్ మేన్ ని కాపీ కొట్టారా?

Project K

ప్రస్తుతం అందరి దృష్టి “ప్రాజెక్ట్ కే” పైనే. హాలీవుడ్ బడా సంస్థలు మాత్రమే పాల్గొనే “కామిక్ కాన్” ఈవెంట్ కి వెళ్ళిన మొదటి భారతీయ చిత్రంగా “ప్రాజెక్ట్ కే” చరిత్ర సృష్టించింది. ఆ ఈవెంట్ కి కొద్ది గంటలు ముందు ప్రభాస్ మొదటి లుక్ ని విడుదల చేసింది టీం.

Advertisement

హాలీవుడ్ సూపర్ హీరోలను తలపించే గెటప్ లో ప్రభాస్ సరికొత్తగా ఉన్నాడు. ఆయన లుక్ అదిరింది. ఐతే, సినిమా నాలెడ్జ్ అధికంగా ఉండేవాళ్ళు ఆల్రెడీ సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. ఇది “ఐరన్ మేన్ 3” సినిమా పోస్టర్ కి మక్కీకి మక్కీ కాపీ అని తేల్చేసింది ట్రోలింగ్ జనం.

ఈ రెండు పోస్టర్లను పక్క పక్కన చూస్తే నిజమే అనిపిస్తోంది మరి.

ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. దీపిక పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె మొదటి లుక్ ఇప్పటికే విడుదలైంది. దీపిక గెటప్ కి పెద్దగా నెగెటివ్ కామెంట్స్ రాలేదు. కానీ ప్రభాస్ మొదటి లుక్ పోస్టర్ మాత్రం బాగా ట్రోలింగ్ కి గురైంది. దానికి కారణం అచ్చంగా “ఐరన్ మేన్ 3” సినిమా పోస్టర్ ని తలపించేలా డిజైన్ చెయ్యడమే.

ALSO READ: Prabhas’s hero avatar in ‘Project K’ revealed

Advertisement
 

More

Related Stories