ఒక్క ఛాన్స్ ప్లీజ్… పృథ్వీ!

Prudhviraj


బ్రహ్మానందం తర్వాత బ్రహ్మానందం అన్న రేంజులో కొన్నాళ్ళు హంగామా చేశాడు పృథ్వీ. అయితే, ఆ వైభవం మూడేళ్లు కూడా ఉండలేదు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి. చేతులారా పోగొట్టుకున్నాడు. రాజకీయాల్లో ఓ రేంజులో వెలగాలని వెళ్తే చీకటి మాత్రమే మిగిలింది.

బుద్ది గడ్డి తిన్నది అంటూ మళ్ళీ ఎక్కడో పోయిందో అక్కడే వెతుక్కుంటున్నాడు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం దర్శకులకు, నిర్మాతలకు తెగ ఫోన్లు చేస్తున్నాడు. పెద్ద దర్శకులందరికీ ఒక రౌండ్ కాల్స్ చేశాడు. ఎదో ఒక కామెడీ పాత్ర ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం విదేశాల్లో ఒక సినిమా షూటింగ్ లో ఉన్న పృథ్వీ అక్కడి నుంచి కూడా అందరికీ కాల్స్ చేస్తూ అడుగుతూ ఉండడం విశేషం.

మంచి కామెడీ పండించే నటుడు పృథ్వీ. టైమింగ్ అదుర్స్. కానీ, రాజకీయాల్లో టైమింగ్ పనిచెయ్యలేదు. దాంతో టైం బ్యాడ్ అయింది. మొత్తానికి వెనక్కి వచ్చాడు. కానీ వెంటనే ఆఫర్లు రావు కదా. సునీల్ కెరీర్ కూడా మళ్ళీ గాడిలో పడేందుకు చాలా టైం పట్టింది. పృథ్వీ కూడా సునీల్ పంథాలోనే అన్ని కాంటాక్ట్స్ ఉపయోగించుకుంటున్నాడు.

పృథ్వీ ఇక రాజకీయాల వైపు చూపు తగ్గించి సినిమాల్లో డబ్బుల సంపాదనలో పడ్డాడు.

 

More

Related Stories