బండ్ల తర్వాత పృథ్వి

Prudhvi and Jeevitha


ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో జీవిత ఉండడంతో బండ్ల గణేష్ ఆ టీం నుంచి బయటికి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ని గతంలో తీవ్రంగా కామెంట్స్ చేసిన ఆమెని ప్యానెల్లోకి ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు బండ్ల. హర్ట్ అయిన బండ్ల ఆమెకి పోటీగా నిల్చుంటాను అని బెదిరించారు కానీ ఆ తర్వాత చడీచప్పుడు లేదు. ఇప్పుడు పృథ్వీరాజ్ వంతు.

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలల్లో విష్ణు ప్యానెల్ నుంచి వైస్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తోన్న పృథ్వీరాజ్‌ తాజాగా జీవితని టార్గెట్ చేశారు . మా సభ్యులని ఆమె ప్రలోభ పెడుతున్నారని అంటున్నారు పృథ్వీరాజ్. రూల్స్ ప్రకారం ఆమెపై చర్యలు తీసుకోవాలనేది అయన డిమాండ్.

బండ్ల వంతు అయిపోయింది ఇప్పుడు పృథ్వీ వంతు అన్నమాట. ఇద్దరూ జీవితనే టార్గెట్ చెయ్యడం విశేషం.

అక్టోబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేడి ఇప్పుడే మొదలు అయింది. ఇక రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ డ్రామా ఉంటుంది.

 

More

Related Stories