వాళ్ళ నుంచి కాల్స్ వసున్నాయి: పృథ్వీ

Prudhvi

రాజకీయాల్లోకి అడుగుపెట్టి దెబ్బతిన్నారు పృథ్వీ. కమెడియన్ గా మంచి ఊపులో ఉన్న సమయంలో ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు. దాంతో ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో కెరీర్ పోయింది. ఆ తర్వాత రాజకీయాల్లో ఇమడలేకపోయారు. తిరిగి సొంత గూటికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ నటుడిగా ఆఫర్లు అందుకుంటున్నారు. ఈ క్రమంలో అతనికి వచ్చిన మంచి ఊపు … “బ్రో”.

పవన్ కళ్యాణ్ నటించిన “బ్రో” సినిమా నిజానికి విజయం సాధించలేదు. కానీ ఈ సినిమాలో పృథ్వీ పోషించిన చిన్న పాత్ర గురించి ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు పెద్ద గొడవ చేశారు. అది పృథ్వీకి కలిసి వచ్చింది. ప్రేక్షక జనాలు మరిచిపోయిన పృథ్వీకి మంచి పబ్లిసిటీ కల్పించారు మంత్రి రాంబాబు.

‘బ్రో’లో శ్యాంబాబు పాత్ర తనని పోలి ఉందని మంత్రి రాంబాబు ఆరోపించారు. కానీ, రాంబాబు పాత్ర తాను ఎందుకు చేస్తానని… దర్శకుడు ఒక ఆవారా పాత్ర చెయ్యాలి అని తనని తీసుకున్నారు అని పృథ్వీ నుంచి కౌంటర్ వచ్చింది. అలా వివాదం చిలికి చిలికి పృథ్వీని వార్తల్లో ఉంచింది. ఇప్పుడు పృథ్వీకి పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతల నుంచి కాల్స్ వస్తున్నాయట.

ఇక తగ్గేదే లే అంటున్నారు పృథ్వీ.

Advertisement
 

More

Related Stories