పూజిత కూడా కోలుకొంది

- Advertisement -
Pujita Ponnada

పూజిత పొన్నాడ కూడా కరోనా రక్కసి కౌగిలి నుంచి బయటపడింది. ఈ అందాల భామకి రెండు వారాల క్రితం కరోనా సోకింది. ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటూ, మందులు వాడి కోలుకొంది. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉంది.

“రెండు వారాల పాటు క్వారంటైన్, ట్రీట్మెంట్ తర్వాత కోవిడ్ నెగెటివ్ వచ్చింది. డాక్టర్లకు కృతజ్ఞతలు. అలాగే, నా కోసం ప్రార్థించిన అందరికీ థాంక్స్. అందరూ దయచేసి ఇంట్లోనే ఉండండి. కరోనా వేవ్ ఇంకా తగ్గలేదు,” అని పూజిత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

‘రంగస్థలం’ వంటి సినిమాల్లో నటించిన పూజిత పొన్నాడ రీసెంట్ గా వెబ్ డ్రామాల్లో కనిపిస్తోంది.

 

More

Related Stories