నేను హీరోయిన్ని కాదు: పున్నూ

Punarnavi Bhupalam

తన పేరుకు అర్థమేంటో చెబుతోంది నటి, బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం. దీంతో పాటు తన కెరీర్ సంగతులు బయటపెట్టింది. పున్నూతో స్మాల్ చిట్ చాట్.

మీ పేరుకు అర్థం ఏంటి?
నా పేరు మీనింగ్ పునర్జన్మ అని అర్థం. మళ్లీ పుట్టింది అని కూడా అనుకోవచ్చు. ఇక నా జీవితంలో నేను మళ్లీ పుట్టాను అనిపించే సందర్భం, నేను యాక్టింగ్ ను కెరీర్ గా ఎంచుకోవడం. నేను సైకాలజీ చదువుతున్నాను, జర్నలిజం కూడా చేస్తున్నాను, యాక్టింగ్ కూడా చేస్తున్నాను. సో.. నా డెస్టినీ ఏంటనేది చెప్పలేను. ప్రస్తుతానికైతే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం.

మీ కెరీర్ పై మీకు తృప్తి ఉందా?
నేను చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ నాకు మంచి తృప్తినిచ్చాయి. అన్ని పాత్రలు నేను మనస్ఫూర్తిగా చేశాను.

ఉయ్యాల-జంపాల తర్వాత సెలక్టివ్ గా సినిమాలు చేశారెందుకు?
నేను సెలక్టివ్ గా వెళ్లాలని అనుకోలేదు. మంచి పాత్రలు మాత్రమే చేయాలని అనుకున్నాను. నేను హీరోయిన్ ను కాదు, నేను ఒక ఆర్టిస్టుని మాత్రమే. మంచి క్యారెక్టర్లు దొరికితే చేస్తాను.

నటికి, హీరోయిన్ కు తేడా ఏంటి?
మనం చేసే పాత్రలే అది నిర్ణయిస్తాయి. ఓ పాత్ర దొరికినప్పుడు అందులో ఒదిగిపోవాలి. హీరోయిన్ అనిపించుకోవడం కంటే ఆర్టిస్టు అనిపించుకోవడం చాలా చాలా కష్టం.

థియేటర్ చేశారు కదా.. ఎలా ఉపయోగపడింది?
థియేటర్ ఆర్టిస్ట్ అనుభవం నాకు చాలా ఉపయోగపడింది. నాకే కాదు, ఎవరికైనా ఉపయోగపడుతుంది. థియేటర్ లో నేను మెంటల్ ఎక్సర్ సైజ్, వోకల్ ఎక్సర్ సైజ్ నేర్చుకున్నాను. బ్రెయిన్ మ్యాపింగ్, మెథడ్ యాక్టింగ్ గురించి తెలుసుకున్నాను. నటించడానికి ఇవన్నీ బాగా ఉపయోగపడ్డాయి.

Related Stories