ధర్నా చేస్తే… పైసా ఇవ్వను!

Puri Jagannadh and Charmee


“లైగర్” సినిమా విడుదలై రెండు నెలలు అయిపోయింది. ఆ సినిమా ఘోరంగా పరాజయం పాలైంది. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు నెల రోజుల్లో అమౌంట్ ఇస్తాను అని పూరి, ఆయన ప్రొడక్షన్ పార్ట్నర్ ఛార్మి మాటిచ్చారు. కానీ, ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు.

డిస్ట్రిబ్యూటర్లకు డబ్బు రాకపోయేసరికి, వాళ్ళు ఎగ్జిబిటర్లకు ఇవ్వలేదు. దాంతో, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసి ధర్నా చెయ్యాలని సిద్ధమవుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పూరి … ఎదురు తిరుగుతున్నారు. తనని బెదిరిస్తే… ధర్నా చేస్తే పైసా ఇవ్వను అని అంటున్నారు.

అంతే కాదు, పూరికి అన్నివిధాలా సపోర్ట్ చేసే రామ్ గోపాల్ వర్మ ‘ఎగ్జిబిటర్లు బెదిరిస్తున్నారు’ అనే అర్థంలో వాట్సాప్ చాట్లు లీక్ చేశారు. రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు వేయడంతోనే పూరి దీని వెనుకున్నారు అని అర్థమైంది.

మొత్తానికి “లైగర్” సినిమా వ్యవహారం ఇంకా ముగియలేదు.

 

More

Related Stories