
దర్శకుడు పూరి జగన్నాధ్ సూపర్ రైటర్. విషయాన్ని సూటిగా, సుత్తి లేకుండా చెప్పడంలో అయన స్టయిలే వేరు. “పూరి మ్యూజింగ్స్”తో గతేడాది నుంచి ఆయన కొన్ని ఆడియో ఫైల్స్ ని సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తున్నారు. వాటికి మంచి క్రేజ్ వచ్చింది. గతేడాది లాక్డౌన్ లో బాగా పాపులర్ అయ్యాయి మ్యూజింగ్స్.
ఎదో ఒక అంశం తీసుకొని దాన్ని తనదైన శైలిలో చెప్తారు. పెళ్ళాం మొగుళ్ళ ముచ్చట్ల నుంచి తినే తిండి వరకు, వెనిస్ నగరం కబుర్లు నుంచి వీనస్ అందం వరకు అన్ని మ్యూజింగ్స్ లోకి వస్తాయి. కొన్ని చాలా అద్భుతంగా ఉన్న మాట కూడా వాస్తవమే.
ఐతే, ఈ ఏడాది స్టార్టింగ్ లో వాటికి బ్రేక్ వేశారు పూరి. ‘లైగర్’ షూటింగ్ రీస్టార్ట్ చేసి… మ్యూజింగ్స్ పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ వచ్చింది. దాంతో ఆయనకి మళ్ళీ అదే కాలక్షేపం అయింది. ఇప్పుడు మ్యూజింగ్స్ రీస్టార్ట్.