ఫ్లాప్స్ మీదే ఇండస్ట్రీ బతుకుతోంది

Puri Jagannadh

దర్శకుడు పూరి జగన్నాధ్ మరోసారి హార్ట్ టచ్ చేశాడు. తన మాటలతో మాయచేసి పడేశాడు. పూరి మ్యూజింగ్స్ పేరిట వరుసగా ఆడియో క్లిప్స్ రిలీజ్ చేస్తూ.. కొన్నింటితో వివాదాలు కూడా రేపుతున్న పూరి జగన్నాధ్ తాజాగా ఫ్లాప్ సినిమాలపై తనదైన విశ్లేషణ ఇచ్చాడు. ఆ మాటల తూటాల్లో కొన్ని…

– ఏటా 200 సినిమాలొస్తే అందులో 190 సినిమాలు ఫ్లాపులే. క్రిటిక్స్ కూడా వాటిని ఏకి పడేస్తుంటారు. కానీ నిజం ఏంటంటే.. ఆ 190 సినిమాల మీదే ఇండస్ట్రీ బతుకుతోంది. అందరికీ అన్నం పెట్టేవి అవే.

– ఫ్లాప్ ను ఎవ్వరూ కోరుకోరు. ఫ్లాప్ అవుతుందని తెలిస్తే ఎవ్వరూ సినిమా తీయరు.

– బిజినెస్ యాంగిల్ లో చూస్తే ఎవ్వడూ సినిమా తీయడు. సినిమా పిచ్చి ఉన్నోళ్లే సినిమా తీస్తారు. ఆ పిచ్చోళ్లను బతకనిద్దాం

– ఫ్లాప్ సినిమా తీసినోడు కనిపిస్తే గట్టిగా ఓ హగ్ ఇవ్వండి. ఎందుకంటే వాడు 100 మందికి అన్నం పెట్టాడు.

– కళామతల్లి కడుపున ఎక్కువగా పుట్టింది ఫ్లాప్ దర్శకులు, ఫ్లాప్ నిర్మాతలే.

– ఫ్లాప్ సినిమా తీసినోడ్ని తిట్టుకోవద్దు. ఎందుకంటే కనీసం అతడు సినిమా తీశాడు. వంద కుటుంబాలకు అన్నం పెట్టాడు

– 300 కేజీలు మీదేసుకొని వణుకుతున్న వెయిట్ లిఫ్టర్ కు ఇంకో 50 గ్రాములు మీద పడినా కుప్పకూలిపోతాడు. ప్రతి సినిమాకు నిర్మాత పరిస్థితి ఇలానే ఉంటుంది.

– సినిమా చూసేటప్పుడు అందులో ప్రాణం ఉందా లేక శవమా అనేది చూడండి. పోయిన సినిమాను ఎవ్వడూ కాపాడలేడు. కనీసం యావరేజ్ చేయడానికి ట్రై చేద్దాం. దాని వల్ల ప్రొడ్యూసర్ కు ఒక్క రూపాయి మిగలదు. కాకపోతే మరో సినిమా అవకాశం వస్తుంది. అదే మనం చేసిన సాయం.

Advertisement
 

More

Related Stories